దుమ్ములేపుతున్న‌‘ఆచార్య నుంచి సానా కష్టం.. సాంగ్

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (19:19 IST)
chiru- rejina
మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నారు. సోమవారం ‘ఆచార్య’ సినిమాలోని మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 
 
‘సానా కష్టం వచ్చేసిందే మందాకిని..’ అంటూ సాగే ఈ స్పెష‌ల్ సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రెజీనా క‌సాండ్ర‌ల‌పై చిత్రీక‌రించారు. టాలీవుడ్‌లో డాన్స్‌, ఇర‌గ‌దీసే స్టెప్పులంటే వెంట‌నే గుర్తుకొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇక స్పెష‌ల్ సాంగ్‌లో ఆయ‌న డాన్సింగ్ పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌దైన మార్క్ స్టెప్పుల‌తో చిరంజీవి డాన్స్ అద‌ర‌గొట్టేశారు. చిరంజీవి డాన్స్ గ్రేస్‌కి, రెజీనా గ్లామ‌ర్ తోడ‌య్యింది. ఈ సాంగ్ థియేట‌ర్స్‌లో మాస్ ఆడియెన్స్‌, మెగాభిమానులను అల‌రిస్తుంద‌ని చిత్ర నిర్మాత‌లు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి తెలియ‌జేశారు. 
 
మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఆచార్య చిత్రంలోని ఈ పాట‌కు భాస్క‌ర‌భ‌ట్ట సాహిత్యాన్ని అందించ‌గా.. రేవంత్ , గీతా మాధురి పాట‌ను ఆల‌పించారు. పాట విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే రెండు మిలియ‌న్ వ్యూస్‌ను, ల‌క్షా పాతిక వేల‌కు పైగా లైక్స్‌ను సాధించ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తు.. భార్య ఇంటి వదిలి వెళ్లిపోయింది.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం

Divya Suresh: కన్నడ నటి దివ్య సురేష్‌పై హిట్ అండ్ రన్ కేసు నమోదు

Montha Cyclone: మొంథా తుపాను.. అప్రమత్తంగా వుండాలి.. పవన్ ఆదేశాలు

ఫిబ్రవరి 25, 2026 నుంచి తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు

ఐదో తరగతి చదివాడు.. కానీ పదవ తరగతి సర్టిఫికేట్‌తో లైసెన్స్.. కర్నూలు బస్సు డ్రైవర్‌పై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments