Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌న‌వ‌రి 26న "S3-య‌ముడు-3" విడుద‌ల‌

వినూత్న‌మైన క‌థాంశాల‌తో పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి స్టార్‌ క్రేజ్‌ను సంపాందించుకున్న సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం "S3-య‌ముడు-3". తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. గ‌తంలో య‌ముడు,

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (21:30 IST)
వినూత్న‌మైన క‌థాంశాల‌తో పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి స్టార్‌ క్రేజ్‌ను సంపాందించుకున్న సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం "S3-య‌ముడు-3". తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. గ‌తంలో య‌ముడు, సింగం చిత్రాలు ఘ‌న‌విజ‌యాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌డు ఆదే సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ అందించిన ఆడియో ఇప్ప‌టికే విడుద‌లైత సూప‌ర్‌హిట్ ఆడియోగా ప్రేక్ష‌కుల ప్ర‌శంసలు పొందుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జ‌న‌వ‌రి 26 న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత‌ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో త‌న న‌ట‌న‌తో, త‌న‌కంటూ ప్ర‌త్యేక అభిమానుల్ని సంపాదించుకున్న సూర్య‌, హరి కాంబినేషన్‌లో రూపొందిన య‌ముడు, సింగం చిత్రాలు ఘ‌న‌విజయాల్ని సాధించాయి. వాటికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రం "S3-య‌ముడు-3" . డైర‌క్ట‌ర్ హ‌రి గారు ఈ చిత్రాన్ని మాస్ యాక్ష‌న్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ప‌రుగులు పెట్టే స్క్రీన్‌ప్లే తో థ్రిల్ ని క‌లిగించే స‌న్నివేశాల‌తో చిత్రం కొన‌సాగుతుంది. 
 
తెలుగు ప్రేక్ష‌కుల్లో హ‌రి స్క్రీన్‌ప్లే‌కి కూడా ఫ్యాన్స్ వుండ‌టం విశేషం, ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్స్ చూసిన తర్వాత ప్రేక్ష‌కుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.  వారి అంచ‌నాలను అందుకునేలా మా చిత్రం వుండ‌బోతుంది. సూర్య గారు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ గా యాక్ష‌న్ తో మ‌రొక్క‌సారి విజృంభించారు. అనుష్క న‌ట‌న‌కి ఈసారి శ్రుతిహాస‌న్ గ్లామ‌ర్ అడిష‌న‌ల్ గా ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌నుంది.
 
నీతి నిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. తెలుగు వెర్ష‌న్ లో మా సంస్థ పార్ట్ అయినందుకు చాలా అనందంగా వుంది. హేరిస్ జైరాజ్ అందించిన ఆడియో  కి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.  చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జ‌న‌వ‌రి 26న మా బ్యాన‌ర్ ద్వారా తెలుగు వెర్ష‌న్ ని విడుద‌ల‌ చేస్తున్నాము. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారని అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments