విక్టరీ వెంకటేష్ సైంధవ్ లో డాక్టర్ రేణుగా రుహాని శర్మ

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (15:31 IST)
Ruhani Sharma
విక్టరీ వెంకటేష్ 75వ మూవీ 'సైంధవ్' కు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ కీలక పాత్రల కోసం దర్శకుడు పెర్ఫార్మార్స్ ను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడరు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.
 
ఈరోజు ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో డాక్టర్ రేణు పాత్రను రుహాని శర్మ పోషిస్తోంది. దర్శకుడి మొదటి చిత్రం 'HIT'లో కనిపించిన రుహాని సైంధవ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెక్టర్ లుక్ పోస్టర్‌లో రుహానీ శర్మ ఎథ్నిక్ వేర్‌లో సీరియస్ గా కనిపిస్తోంది. నటీనటుల ఎంపికకు సంబంధించి ఒక్కో అనౌన్స్ మెంట్ ఉత్కంఠను రేపుతోంది. ఈ ఆసక్తికరమైన స్టార్ కాస్ట్ తో శైలేష్ ఏం చేస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా వుంది.
 
ప్రధాన తారాగణం పాల్గొంటున్న సైంధవ్ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టేకాఫ్ అవుతుండగా విమానంలో అగ్నిప్రమాదం.. 180 మంది ప్రయాణికులు పరిస్థితి??

ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్‌ను మహిళ కడపులో వదేలేశారు...

పవన్ కళ్యాణ్ వివాదంపై నాలుక మడతేసిన మంత్రి వెంకట్ రెడ్డి

రామేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ అయ్యప్ప భక్తులు మృతి

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments