Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుద్రమదేవి హిందీ ట్రైలర్ రిలీజ్: అక్టోబర్ 9న వస్తోన్న కాకతీయ వీరనారి

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (15:21 IST)
కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి ఘనతను ప్రపంచానికి చాటిచెప్పే ఉద్దేశంతో భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ రుద్రమదేవి సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే ఈ సినిమా ఆడియో, ట్రైలర్లను రిలీజ్ చేశారు. ఆడియో, ట్రైలర్లను మంచి స్పందన వచ్చింది. రుద్రమదేవిగా అనుష్క నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీన రిలీజ్ కానుంది. హిందీ వెర్షన్ సైతం అదే రోజు రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రిలయన్స్ వారు హిందీలో ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. 
 
తాజాగా హిందీ వెర్షన్ ట్రైలర్‌ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూసిన వారు సూపర్‌గా ఉందని మెచ్చుకుంటున్నారు. కచ్చితంగా హిందిలో మంచి ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్‌ త్రీడీ ద్విభాషా చిత్రమిది కావడం విశేషం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తుది దశ వీఎఫ్‌ఎక్స్‌ పనులు చేపడుతున్నారు. 
 
ఈ కథలో ప్రధాన పాత్రల్లో ఒకటైన మహామంత్రి 'శివదేవయ్య' పాత్రను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ పోషించారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ '' సాంకేతికంగా సినిమాని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మరి కొంత సమయం తీసుకుంటున్నాం. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు దేశవిదేశాల్లో చేపడుతున్నాం. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించేలా ఉంటుందని వ్యాఖ్యానించారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments