భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR, రాధే శ్యామ్ చిత్రాలకు వసూళ్ల పరంగా ఇబ్బందులు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. దీంతో ఈ రెండు సినిమాలకు చెందిన మేకర్స్ రిలీజ్‌ను వాయిదా వేస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ రెండు చిత్రాల్లో RRR జనవరి 7న విడుదలవుతుంది.
అలాగే రాధే శ్యామ్ చిత్రం జనవరి 14న విడుదలవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. మరో వైపు ఇప్పటికే రెండు చిత్రాలకు సంబంధించి ప్రమోషన్స్ భారీ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలకు దక్షిణాదిన వచ్చిన సమస్యలేమీ లేవు. కానీ.. అసలు సమస్యంతా బాలీవుడ్‌లోనే మొదలైంది.
ఎందుకంటే శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను విధిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంటే నైట్ షోస్ ఉండవు.
అంతేకాకుండా మిగిలిన ఆటలను 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇలాంటి పరిస్థితులుంటే భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR, రాధే శ్యామ్ చిత్రాలకు వసూళ్ల పరంగా ఇబ్బందులు తలెత్తుతాయనడంలో సందేహం లేదు.