Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు ఓటీటీల్లో ఆర్ఆర్ఆర్..

Webdunia
గురువారం, 12 మే 2022 (12:24 IST)
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. 
 
అయితే ఈ మూవీలో చరణ్, ఎన్టీఆర్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగణ్, శ్రియ సముద్రఖని, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు.
 
ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సినీ యూనిట్ సిద్ధమైంది. 'ఆర్ఆర్ఆర్' మూవీని రెండు ఓటీటీల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 
 
దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌ను జీ5 డిజిటల్ ప్లాట్ ఫారమ్‌లో విడుదల చేయనున్నారు. మే 20న ఈ రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. 
 
అయితే హిందీ వర్షన్‌ను ఎప్పుడు, ఎందులో విడుదల చేయనున్నారనే విషయంపై క్లారిటీ రాలేదు. కానీ, 'ఆర్ఆర్ఆర్' మూవీ హిందీ వర్షెన్‌ను నెట్ ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments