Webdunia - Bharat's app for daily news and videos

Install App

RRR mania: హైద‌రాబాద్‌లో వంద‌మంది అల్లూరి సీతారాములు - కొమ‌రం ఊసేలేదు!

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (16:28 IST)
Alluri Sitaramarajulu
రాజ‌మౌళి సినిమా ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఈరోజే విడుద‌లైంది. ఈ సినిమా విడుద‌ల ముందు ప్ర‌మోష‌న్ ఎలాగూ జ‌రిగింది. ఇప్పుడు త‌ర్వాత కూడా ప్ర‌మోష‌న్ జ‌రుగుతోంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టించాడు. ఇప్పుడు అదే హైలైట్ అయింది. సినిమాకు ముందు అల్లూరి వార‌సులు రాజ‌మౌళిపైనా, నిర్మాత‌పైనా కేసు వేస్తామ‌ని ఢంకాలు బ‌నాయించారు. క‌ట్ చేస్తే, సీన్ రివ‌ర్స్ అయింది. ఏకంగా 100 మంది అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్‌ల‌తో హైద‌రాబాద్‌లో ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో జీపులు, బైక్‌ల‌తో ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. 
 
Alluri Sitaramarajulu
కార‌ణం, అల్లూరి పాత్ర‌కు వ‌న్నెతెచ్చేలా సినిమా వుండ‌డ‌మే. అయితే కొమ‌రం భీమ్ లా వేషాలు వేసుకుని తిరిగే వారు క‌నిపించ‌లేదు. కానీ, ఎన్టీఆర్, అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. పాలాభిషేకాలు, డప్పులు, బాణాసంచాలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.  అయితే ఎన్టీఆర్ పోస్టర్ ముందు కొంతమంది అభిమానులు ఒక మేకను బలి ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా ఒక‌రి అభిమానులు ఒక‌ర‌కంగా త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments