Webdunia - Bharat's app for daily news and videos

Install App

య‌ధార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఆర్పీ పట్నాయక్ 'మన‌లో ఒక‌డు'

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన 'మ‌న‌లో ఒక‌డు' ఆడియో ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాట‌ల‌కు చ‌క్క‌టి స్పంద‌న వ‌చ్చిన సంద‌ర్భంగా

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (16:36 IST)
ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన 'మ‌న‌లో ఒక‌డు' ఆడియో ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాట‌ల‌కు చ‌క్క‌టి స్పంద‌న వ‌చ్చిన సంద‌ర్భంగా ఈ నెల 19న తిరుప‌తి వేదిక‌గా ఆడియో స‌క్సెస్ మీట్ జ‌ర‌గ‌నుంది. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్న చిత్ర‌మిది.
 
'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా న‌టించారు. ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ 'మా చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం డీటీయ‌స్ మిక్సింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ నెల 19న తిరుప‌తిలో సంగీత విజ‌యోత్స‌వాన్ని నిర్వ‌హిస్తాం. 'మ‌న‌లో ఒక‌డు' మీడియా నేప‌థ్యంలో సాగుతుంది. కృష్ణ‌మూర్తి అనే సామాన్య అధ్యాప‌కుడి క‌థ ఇది. కొన్ని య‌ధార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా అల్లుకున్నాం' అని వివరించారు. 
 
నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ 'ప్ర‌స్తుత స‌మాజంలో మీడియా పాత్ర ఏంటో మ‌నందరికీ తెలుసు. అలాంటి మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాం. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. అందుకే 19న తిరుప‌తిలో ఆడియో స‌క్సెస్ వేడుక‌ను నిర్వ‌హిస్తాం. ఈ నెలాఖ‌రున చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments