Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HBDMadhubala 'తలైవి' చిత్రం నుంచి 'రోజా' హీరోయిన్ ఫస్ట్ లుక్

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (15:55 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. ఈ చిత్రంలో రోజా మూవీలో నటించిన మధుబాల కీలక పాత్రలో నటించింది. ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ పాత్రలో మధుబాల నటిస్తోంది. ఈరోజు మధుబాల పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Thalaivi (@thalaivithefilm)

కాగా తలైవి చిత్రం ట్రైలర్‌ను కంగనా రనౌత్ పుట్టిన రోజును పురస్కరించుని ఇటీవల చెన్నైలో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయగా, ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ అద్భుతంగా నటించింది. బాలీవుడ్‌లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు పోషించి తనకంటు ఒక సపరేట్ ఇమేజ్ అండ్ పాపులారిటీని సంపాదించుకున్న కంగనా.. తాజాగా 'తలైవి' సినిమాలో తన అత్యద్భుత నటనను ప్రదర్శించి, ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.
 
లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్ రచన, దర్శకుడు విజయ్ తెరకెక్కించిన విధానం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కంగనా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆ లెజెండరీ పర్సనాలిటీని మరిపించి ఇన్నాళ్ళు కొందరిలో ఉన్న అనుమానాలను పటా పంచలు చేసింది. 
 
ఇక దివంగత ఎంజి.రాచమంద్రన్ పాత్రలో అరవింద స్వామి జీవించారు. ఈ సినిమాకు ఆయన పాత్ర పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక 'తలైవి' ఏప్రిల్ 23న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చారు. తన సంగీతంతో ఈ చిత్రంలోని ఎమోషనల్ సన్నివేశాలకు ప్రాణం పోశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments