కబాలి హిట్‌తో హ్యాపీగా ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా రోబో-2 సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్‌లో తెరకెక్కనున్న రోబో 2.0 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్
కబాలి హిట్‌తో హ్యాపీగా ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా రోబో-2 సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్‌లో తెరకెక్కనున్న రోబో 2.0 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. తాజాగా రోబో 2.0లో రజనీ కాంత్ లుక్ ఏవిధంగా ఉంటుందోనని కబాలి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ.. డైరక్టర్ శంకర్ అధికారికంగా ట్విట్టర్ ద్వారా ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు.
ఓ సన్నివేశాన్ని రజనీకాంత్‌కు శంకర్ సీరియస్‌గా వివరిస్తుండగా, సూపర్‌స్టార్ ఆసక్తిగా దాన్ని వింటున్నట్లు కనిపించింది. ఇకపోతే.. ఈ సన్నివేశాలను చెన్నైలోని చేపాక్ క్రికెట్ స్టేడియంలో చిత్రీకరించారు. ఇది క్లైమాక్స్ సీన్ అని తెలుస్తోంది. ఆర్మీ వాహనం, వెపన్స్ నేపథ్యంలో షూట్ చేశారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సెట్ వేశారు. ఇందుకోసం రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్.
ఇకపోతే.. ఈ సినిమా ఫస్ట్ లుక్ డిసెంబర్‌లో రజనీ కాంత్ బర్త్ డేకి రిలీజ్ అవుతున్నట్లు తెలిసింది. ఇక రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, విలన్‌గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు సుధన్షు పాండే కూడా కీలకపాత్ర చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకి రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నాడు.