Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూటర్న్ తీసుకున్న పాయల్... ఛీ.. రిచాకు సారి చెప్పడమా? నో.. నెవర్!!

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (13:17 IST)
బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ ప్లేటు ఫిరాయించింది. బాలీవుడ్ నటి రిచా చద్దా వేసిన పరువు నష్టం దావా కేసులో సారీ చెపుతున్నట్టు ప్రకటించిన ఆమె తాజాగా యుటర్న్ తీసుకుంది. తాను క్షమాపణలు కోరే ప్రసక్తే లేదనీ తేల్చి చెప్పింది. పైగా, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనకు చెప్పిన మాటలనే తాను చెప్పానని, తాను ఎవరిపైనా అవాస్తవాలు ప్రచారం చేయడం లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా తాను న్యాయం కోసం పోరాడుతున్నట్టు పాయల్ ఘోష్ తెలిపింది. 
 
ఇటీవల ఓ తెలుగు చానల్‌కు పాయిల్ ఘోష్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో పాయల్ మాట్లాడుతూ, బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై అత్యాచార ఆరోపణలు చేసింది. అంతేకాక, రిచా చద్దా, మహీ గిల్, హ్యుమా ఖురేషీ వంటి వారి పేర్లను కూడా తెరపైకి తీసుకొచ్చింది.
 
ఈ హీరోయిన్లు చాలా సాదాసీదాగా కనిపించినా కశ్యప్ వారికి అవకాశాలు ఇస్తున్నాడంటే అందులో ఉన్న మర్మమేంటో అర్థం చేసుకోవచ్చని, సాధారణంగా ఇలా నామమాత్రపు అందంతో కనిపించే వారికి దర్శకులు సలహాలు ఇవ్వరని పేర్కొంది. 
 
వారికి అవకాశాలు ఇస్తుండడం వెనుక ఉన్న మతలబు అందరికీ తెలిసిందేనని నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. రిచా తనకు కేవలం ఒక్క ఫోన్‌కాల్ దూరంలో ఉంటుందని అనురాగ్ తనతో చెప్పినట్టు పేర్కొంది.
 
ఈ వ్యాఖ్యలను ఇద్దరు హీరోయిన్లు సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, రిచా చద్దా మాత్రం తీవ్రంగా పరిగణించింది. తనపై ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిందంటూ సదరు నటిపై బాంబే హైకోర్టును ఆశ్రయించి రూ.1.1 కోట్ల పరువునష్టం దావా వేసింది.
 
ఈ పిటిషన్‌పై బుధవారం విచారణకు జరుగగా, తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి, స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు పాయల్ తరపు న్యాయవాది నితిన్ సత్పుటే తెలిపారు.
 
రిచాకు తన క్లయింట్ పెద్ద అభిమాని అని, ఆమెను గౌరవిస్తుందని పేర్కొన్నారు. రిచాను అప్రతిష్ఠపాలు చేయాలనుకోవడం ఆమె ఉద్దేశం కాదని, తన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవడంతోపాటు బేషరతు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు తెలిపారు.
 
దీంతో స్పందించిన రిచా తరపు న్యాయవాదులు వీరేందర్ తుల్జాపూర్కర్, సవీనా బేడీ సచార్‌లు పాయల్ క్షమాపణలను అంగీకరిస్తున్నామని, దావాను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించడంతో వివాదం సద్దుమణిగిందని ప్రతి ఒక్కరూ భావించారు. 
 
కానీ, నటి పాయల్ ఘోష్ యూటర్న్ తీసుకుంది. తాను ఎవరికీ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా లేనని తేల్చి చెప్పింది. తాను ఎవరిపైనా అవాస్తవాలు ప్రచారం చేయలేదని, రిచా గురించి అనురాగ్ తనతో చెప్పిన విషయాన్ని మాత్రమే తాను వెల్లడించానని పేర్కొంది. 
 
అందువల్ల తాను క్షమాపణలు చెప్పాలనుకోవడం లేదని తెగేసి చెప్పింది. రిచాను ఇబ్బంది పెట్టాలని తాను అనుకోవడం లేదని, సాటి మహిళగా మరో మహిళకు అండగా ఉండాలనే కోరుకుంటానని పేర్కొంది. కశ్యప్‌కు వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడుతున్నానని, అతడి నిజస్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నానని తెలిపింది. 
 
తాను ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదని, ఎవరిపైనా అవాస్తవాలు ప్రచారం చేయలేదని స్పష్టం చేసింది. రిచా గురించి అనురాగ్ తనతో చెప్పిన విషయాన్ని మాత్రమే తాను బయటకు చెప్పానని పాయల్ వివరించింది. దీంతో రిచా, పాయల్ మధ్య వివాదం సమసిపోయిందనుకున్న వేళ మరోమారు ఇది చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

Amaravati: అమరావతిలో 74 ప్రాజెక్టులు- సీఆర్డీఏ భవనం ఆగస్టు 15న ప్రారంభం

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments