Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళికి షాకింగ్ రిప్లై ఇచ్చిన వర్మ, ఇంతకీ ఏంటది..?

Webdunia
గురువారం, 12 నవంబరు 2020 (19:52 IST)
గ్రీన్ ఇండియా ఛాలెంజ్... రాజ్యసభ్య సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. దీనికి సినీ ప్రముఖుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, ప్రభాస్, సునీల్, రకుల్ ప్రీత్, రానా, శ్రద్దా కపూర్, అలియా భట్, జగపతిబాబు లాంటి సెలబ్రిటీలు చాలామంది ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు.
 
అంతేకాకుండా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి ముగ్గురుకి ఛాలెంజ్ విసేరేశారు. తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో రాజమౌళి పాల్గొన్నారు. 
 
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన దర్శకుడు రాజమౌళి సహ దర్శకులు పూరి జగన్నాథ్, వినాయక్, రామ్ గోపాల్ వర్మలకు ఛాలెంజ్ ఫార్వర్డ్ చేశారు. అయితే... ఎప్పుడూ వివాదాల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ, రాజమౌళికి కూడా అలాంటి సమాధానమే ఇచ్చారు.
 
ఇంతకీ వర్మ ఏమన్నారంటే... నేను గ్రీన్‌కు, ఛాలెంజ్‌లకు దూరం. మట్టిని ముట్టుకోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. మొక్కలకు నాలాంటి స్వార్థపరుడు అవసరం లేదు. మీకు, మీ మొక్కలకు ఆల్ ది బెస్ట్` అంటూ ట్వీట్ వేశారు. 
 
వర్మ రిప్లై చూసిన నెటిజన్లు.. అనవసరంగా వర్మకు రాజమౌళి ఛాలెంజ్ విసిరారు. అలా చేయకుండా ఉండాల్సింది అంటున్నారు. అంతేకాకుండా.. సమాజం గురించి కబుర్లు చెప్పే వర్మ ఈ మంచి పని చేయచ్చు కదా అంటున్నారు. మరి.. వర్మ రిప్లైకి రాజమౌళికి ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments