Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకత్వం వహించనున్న రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ త్వరలోనే ఓ ఇంటికి కోడలు కానుంది. పవన్‌తో సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా పవన్ - రేణూ విడ

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (14:50 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ త్వరలోనే ఓ ఇంటికి కోడలు కానుంది. పవన్‌తో సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.  ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా పవన్ - రేణూ విడిపోయారు.
 
ఈ నేపథ్యంలో రేణూ దేశాయ్ త్వరలోనే రెండో పెళ్ళి చేసుకోనుంది. ఇందుకోసం నిశ్చితార్థ ఘట్టం కూడా పూర్తయింది. అలా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న రేణూ దేశాయ్.. ఇపుడు ఓ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనుందట. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. స్క్రిప్ట్ పని పూర్తైందని, త్వరలోనే సినిమాను మొదలుపెడతామని అన్నారట.  
 
ఈ సినిమా కథ కూడా రైతుల సమస్యల చుట్టూ తిరిగేలా ఆమె తయారు చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఆమె కొంతమంది రైతుల్ని కలిసి వారి బాధల్ని నేరుగా తెలుసుకోనున్నారట. అంతేకాదు ఈ చిత్రాన్ని స్వయంగా ఆమే నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రంలో నటీనటులెవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, రేణూ దేశాయ్ గతంలో 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

పవన్ కుమారుడు మార్క్ స్కూలులో అగ్ని ప్రమాదం.. వారికి సత్కారం

స్వదేశాలకు వెళ్లేందుకు అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్!!

నైరుతి సీజన్‌లో ఏపీలో విస్తారంగా వర్షాలు ... ఐఎండీ వెల్లడి

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments