కొందరు మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు.. రేణూ దేశాయ్ (Video)

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (11:15 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. కొందరు మన జీవితాల్లోకి అనుకోకుండా వస్తారు అంటూ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఆమె తాజాగా రేణూ దేశాయ్‌ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్‌ వైరలవుతోంది.  విమానంలో ప్రయాణిస్తున్న వీడియో పెట్టిన ఆమె అందమైన నోట్‌ను రాశారు. 
 
'కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు. వాళ్ల పరిచయం మండు వేసవిలో చల్ల గాలిలా మనసుకు ఊరటనిస్తుంది. వాళ్ల చూపులు నేరుగా మన హృదయంతో మాట్లాడతాయి. అది ఒక అందమైన భాష. మనం వాళ్లతో కొన్ని గంటల సమయం గడిపినప్పటికీ.. వాళ్ల ప్రభావం మనపై జీవితాంతం ఉంటుంది. అలాంటి పరిచయాల్లో కొన్ని మనల్ని బాధపెడతాయి కూడా. వాళ్లు మన జీవితానికి పరిపూర్ణతను ఇస్తారు. మన కన్నీళ్లను తుడిచి... మన జీవితాల్లో వెలుగును నింపుతారు. మనల్ని నవ్విస్తుంటారు' అని రేణూ దేశాయ్‌ తన పోస్టులో పేర్కొన్నారు. 
 
ఇటీవల అకీరాతో కలిసి ఆమె ప్రయాణిస్తోన్న వీడియో కూడా నెట్టింట సందడి చేసింది. ఇక కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రేణూ దేశాయ్ త్వరలోనే వెండితెరపై కనిపించనున్నారు. 18 ఏళ్ల విరామం తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న 'టైగర్‌ నాగేశ్వరరావు'లో ఆమె నటిస్తున్నారు. హేమలతా లవణం అనే స్ఫూర్తిదాయకమైన పాత్రలో రేణు కనిపించనున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మోసం చేసిన ప్రియురాలు.. ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments