Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్రర్ సబ్జెక్టులో రెజీనా.. సెల్వరాఘవన్.. ఎస్‌జే సూర్య కాంబోలో సినిమా.. (Trailer)

దర్శకుడు ఎస్‌జే సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ''నెంజం మరప్పదిల్లై''. ఈ సినిమా 1963లో శ్రీధర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. హార్రర్ సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల మదిని బాగానే ఆకట్ట

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (09:00 IST)
దర్శకుడు ఎస్‌జే సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ''నెంజం మరప్పదిల్లై''. ఈ సినిమా 1963లో శ్రీధర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. హార్రర్ సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల మదిని బాగానే ఆకట్టుకుంది. అదే టైటిల్‌తో దర్శకుడు సెల్వరాఘవన్‌ మళ్లీ ఈ తరం ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు ఎస్‌జే సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఎటువంటి కథతో రూపొందుతోందని.. ఇప్పటిదాకా సెల్వరాఘవన్ జాగ్రత్తపడ్డారు. 
 
తాజాగా విడుదల చేసిన టీజర్‌తో ఇది కూడా హర్రర్‌ చిత్రమేనని తేలిపోయింది. అందాల తార రెజీనా దెయ్యం పాత్రలో నటిస్తోంది. నందిత రెండో హీరోయిన్‌. ప్రేమ, కామం నేపథ్యంతో 'నెంజం మరప్పదిల్లై' తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీత సారథ్యంలో పాటలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాను మరో దర్శకుడు గౌతమ్‌వాసుదేవ మీనన్‌ నిర్మిస్తుండగా, ఎస్కేప్‌ ఆర్టిస్ట్‌ బ్యానర్‌పై మదన్‌ పంపిణీ చేయనున్నారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. 

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటానంటూ భర్తకు సవాల్, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments