Webdunia - Bharat's app for daily news and videos

Install App

గబ్బర్ సింగ్‌లో ఏం చేస్తిరిపై రాజశేఖర్ ఏమన్నారు? శివానీ ఎంట్రీ ఖాయమన్నారు..

''గబ్బర్ సింగ్'' సినిమా గురించి హీరో రాజశేఖర్ స్పందించారు. పవన్ కల్యాణ్‌కు తనంటే చాలా కోపమని హీరో రాజశేఖర్ తెలిపాడు. డ్యాన్స్ చేపించిన తర్వాత ఏం చేస్తిరి.. ఏం చేస్తిరి.. ఏంటి? అని అలీ ఏదో వచ్చి మాట్లా

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (14:40 IST)
''గబ్బర్ సింగ్'' సినిమా గురించి హీరో రాజశేఖర్ స్పందించారు. పవన్ కల్యాణ్‌కు తనంటే చాలా కోపమని హీరో రాజశేఖర్ తెలిపాడు. డ్యాన్స్ చేపించిన తర్వాత ఏం చేస్తిరి.. ఏం చేస్తిరి.. ఏంటి? అని అలీ ఏదో వచ్చి మాట్లాడినట్టు చూపిస్తారు. ఆయన కోపాన్ని.. ఏంట్రా.. చూస్కో అన్నట్లు తనకు వార్నింగ్ ఇచ్చారని.. ఆ సీన్ తన కోసమే పవన్ చేశారని రాజశేఖర్ చెప్పారు.
 
గబ్బర్ సింగ్ చిత్రంలోని ఈ సీన్ ద్వారా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తనను ఇమిటేట్ చేయడం తనకు బాధ కలిగించిందని రాజశేఖర్ అన్నారు. గతంలో పీఆర్పీలో జరిగిన విషయాలు.. పవన్ గురించి జరిగిన విషయాలు తాను చెప్పాను. అందుకే పవన్‌కు తనపై కోపం అనుకుంటానని రాజశేఖర్ చెప్పారు. త్వరలో తాను నటిస్తున్న గరుడవేగ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపారు. 
 
అంతేగాకుండా.. తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పదలుచుకుంటున్నానని... త్వరలో తన వారసురాలు హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనుందని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. తన పెద్ద కుమార్తె శివానీకి సినిమాల్లో నటించడం అంటే ఇష్టమని.. తొలి సినిమా కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నానన్నారు. మంచి సబ్జెక్ట్ వున్న సినిమాల్లో నటించేందుకు శివానీ ఆసక్తి చూపుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments