కృష్ణంరాజు చనిపోవడానికి కారణం ఇదేనట.. వైద్యుల వెల్లడి

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (09:46 IST)
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన సీనియర్ నటుడు కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు వయస్సు 82 యేళ్లు. అయితే, ఆయన మృతికి గల కారణాలను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. 
 
కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్, కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారని తెలిపారు. గత నెల ఐదో తేదీన ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారని చెప్పారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
అయితే, ఆదివారం వేకువజామునన తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు. కృష్ణంరాజు పార్థివదేహం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకోనుంది. సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేవలం మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో పాటు తీవ్రమైన కార్డియాక్ అరెస్టుతోనే చనిపోయారు. 
 
రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స కూడా జరిగినట్టు పేర్కొన్నారు. అలాగే, దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని, గత నెల 5న పోస్టు కొవిడ్ సమస్యలో ఆసుపత్రిలో చేరారని వివరించారు.
 
కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే వెంటిలేటర్‌పై ఉంచినట్టు చెప్పారు. ఈ తెల్లవారుజామున 3.16 గంటలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన పార్థివ దేహాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నివాసానికి తరలించి, సోమవారం అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bihar Assembly Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం

నడిరోడ్డుపైనే దేశాధ్యక్షురాలిని వాటేసుకుని ముద్దు పెట్టుకోబోయాడు (video)

TTD: 50 ఎకరాల్లో వసతి భవనాలు, 25 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments