Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్‌ను బాలయ్యే ఆపేశాడా? ఎందుకు.. కారణం ఏమిటి?

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ ఆగిపోయింది. స్వయంగా బాలకృష్ణే షూటింగ్‌ను ఆపించారు. ఎందుకు బాలయ్యకు కోపం వచ్చిందా.. డైరక్టర్‌తో మనస్పర్ధలా? అని అనుకుంటున్నారు కదూ.. అవన్నీ ఉత్తుత్తిదే. ఇంతకీ ఏం జరిగ

Webdunia
శుక్రవారం, 22 జులై 2016 (14:08 IST)
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ ఆగిపోయింది. స్వయంగా బాలకృష్ణే షూటింగ్‌ను ఆపించారు. ఎందుకు బాలయ్యకు కోపం వచ్చిందా.. డైరక్టర్‌తో మనస్పర్ధలా? అని అనుకుంటున్నారు కదూ.. అవన్నీ ఉత్తుత్తిదే. ఇంతకీ ఏం జరిగిందంటే..? బాలకృష్ణ షూటింగ్‌ను ఆపేలా చేసింది క్రిష్ పెళ్ళి కోసం. ఈ చిత్ర దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) పెళ్ళి భాజాలు త్వరలో మోగనున్నాయి. 
 
ఆగస్టు 8వ తేదీన హైదరాబాదుకు చెందిన డాక్టర్ రమ్యను క్రిష్ పెళ్లాడనున్నాడు. ఇప్పటికే పెళ్లి డేటు దగ్గరపడుతున్నా.. క్రిష్ ఇంకా సినిమా పనుల్లోనే బిజీగా ఉంటుండంతో బాలయ్యే స్వయంగా జోక్యం చేసుకుని సినిమా షూటింగ్‌ను ఆపించారు. ప్రస్తుతం జార్జియా షెడ్యూల్లో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. 
 
దీంతో జార్జియా షూటింగ్ లొకేషన్ నుంచి క్రిష్‌ను బాలయ్య పెళ్ళి కోసం బయల్దేరమన్నాడు. బాలయ్య చెప్పడంతో రెండు రోజుల్లో క్రిష్ జార్జియా నుంచి హైదరాబాద్‌కు రానున్నాడు. పెళ్లయ్యాక క్రిష్ తిరిగి జార్జియా షూటింగ్‌లో పాల్గొంటారని సినీ యూనిట్ వర్గాల సమాచారం. 
 
ఇకపోతే నందమూరి హీరో బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో శ్రియ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా హేమమాలిని, కబీర్ బేడి లాంటి హాలీవుడ్ నటుడు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కన్పించనున్నారు. అన్నీ పనులు పూర్తి చేసుకుని గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments