Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ సరసన కేథరిన్.. ''నేల టికెట్'' ఎప్పుడొస్తుందంటే?

మాస్ మహారాజ రవితేజ హీరోగా రెండు సినిమాలు లైన్లో వున్నాయి. గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.. రవితేజ. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ తాజాగా ''నేల టికెట్'' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (13:48 IST)
మాస్ మహారాజ రవితేజ హీరోగా రెండు సినిమాలు లైన్లో వున్నాయి. గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.. రవితేజ. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ తాజాగా ''నేల టికెట్'' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలావరకు ముగిసింది. మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. 
 
రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ చివరినాటికి ఈ సినిమా షూటింగును పూర్తిచేసి, మే చివరలో విడుదల చేయనున్నారు. మాళవిక శర్మ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఈ చిత్రం తర్వాత రవితేజ శ్రీనువైట్ల దర్శకత్వంలో ''అమర్ అక్బర్ ఆంటోని'' సినిమాలో నటిస్తున్నాడు. ఈ దిశగా సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఆపై దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌కి కూడా రవితేజ పచ్చజెండా ఊపాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. 
 
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో రవితేజ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా ఎంచుకున్నట్లు ప్రచారం సాగింది. కానీ కేథరిన్‌ను హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఎక్కడి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం ఫేమ్ వీఐ ఆనంద్‌తోనూ రవితేజ నటిస్తాడని.. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ బిజీగా వున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెడలో పుర్రెలు ధరించి వరంగల్ బెస్తంచెరువు స్మశానంలో లేడీ అఘోరి (video)

నారా రోహిత్‌కు లేఖ రాసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

జాతీయ రహదారుల తరహాలో గ్రామీణ రోడ్ల నిర్మాణం.. చంద్రబాబు

పెళ్లైన రోజే.. గోడకు తలను కొట్టి.. చీరతో గొంతుకోసి భార్యను చంపేశాడు

విశాఖలో లా విద్యార్థినిపై సామూహిక అఘాయిత్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments