Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ - శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ - అనిల్ రావిపూడిల 'రాజా ది గ్రేట్' లోగో విడుద‌ల

మాస్ మ‌హారాజా ర‌వితేజ...ఇడియ‌ట్ నుండి బెంగాల్ టైగ‌ర్ వ‌ర‌కు త‌న‌కే సొంత‌మైన‌ డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో ఆడియెన్స్‌లో త‌న‌దైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో. మాస్‌కు స‌రికొత్త అర్థం

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (15:28 IST)
మాస్ మ‌హారాజా ర‌వితేజ...ఇడియ‌ట్ నుండి బెంగాల్ టైగ‌ర్ వ‌ర‌కు త‌న‌కే సొంత‌మైన‌ డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో ఆడియెన్స్‌లో త‌న‌దైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో. మాస్‌కు స‌రికొత్త అర్థం చెప్పిన ఈ హీరోను కుర్ర‌కారు ముద్దుగా మాస్ మ‌హారాజా ర‌వితేజ అని పిలుచుకుంటారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న కొత్త చిత్రం `రాజా ది గ్రేట్`. `వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్‌` క్యాప్ష‌న్‌. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ అంటేనే నాటి దిల్ నుండి నేటి శ‌త‌మానం భ‌వ‌తి వ‌ర‌కు ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న నిర్మాణ సంస్థగా ప్రేక్ష‌కుల్లో మంచి పేరుంది.  
 
ఇటువంటి స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్  శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ప‌టాస్‌, సుప్రీమ్ వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా `రాజా ది గ్రేట్` సినిమా రూపొందుతుంది. ఈ సినిమా లోగో పోస్ట‌ర్‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ పుట్టిన రోజు జ‌న‌వ‌రి 26వ తేదీ రిప‌బ్లిక్‌ డే సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ ఫేమ్ మెహ‌రిన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. 
 
ఈ సంద‌ర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ. ``ముందు ర‌వితేజ‌కు హ్య‌పీ బ‌ర్త్‌డే. గ‌తంలో నేను, రవితేజ క‌లిసి చేసిన భ‌ద్ర సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అందిరికీ తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి మా కాంబినేష‌న్‌లో `రాజా ది గ్రేట్‌` సినిమా తెర‌కెక్క‌నుంది. తొలి చిత్రం ప‌టాస్‌తో సూప‌ర్‌హిట్ సాధించి, మా బ్యాన‌ర్‌లో సుప్రీమ్ వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాన్ని అందించిన అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. హీరోల‌ను స‌రికొత్త‌గా ప్రెజెంట్ చేసే అనిల్ ఈ సినిమాలో మన మాస్ మ‌హారాజా ర‌వితేజను కొత్త‌గా చూపించ‌బోతున్నాడు. 
 
ఈ సినిమా లోగో పోస్ట‌ర్‌ను ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేసేలా ఉండ‌ట‌మే కాదు మా బ్యాన‌ర్‌లో మ‌రో స‌క్సెస్‌ఫుల్ మూవీ అవుతుంది. త్వ‌ర‌లోనే ఇత‌ర నటీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం`` అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

Pawan Kalyan: దళితులను అవమానిస్తే ఎదురు తిరగండి.. ఓజీ ఓజీ ఏంటి.. పక్కకు పో...(video)

ఎంపీడీవోపై సుదర్శన్ రెడ్డి దాడి.. చొక్కా పట్టుకుని, చెంపదెబ్బలు కొడుతూ.. సీఐకి సెల్యూట్ (వీడియో)

Hyderabad: బస్టాప్‌లో గంజాయి.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్ట్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

తర్వాతి కథనం
Show comments