Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ రావణాసుర నుంచి థర్డ్ సింగిల్ రాబోతుంది

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (10:21 IST)
Ravanasura 3rd song
మాస్ మహారాజా రవితేజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో వస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రవితేజ మల్టీ షేడ్ క్యారెక్టర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు.
 
హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో కలిసి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రంలోని మూడవ సింగిల్- వెయ్యినొక్క జిల్లాల వరకు లిరికల్ వీడియో మార్చి 15న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇది రెట్రో నేపథ్య పాట అని సూచిస్తుంది. రవితేజ, మేఘా ఆకాష్ ఇద్దరూ స్కూటర్‌పై కూర్చొని రెట్రో కాస్ట్యూమ్స్‌లో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ పాట ప్రోమో రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది.
 
విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా యూనిక్ కథను అందించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్.
 ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ప్రపంచ వ్యాప్తంగా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments