Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ మహారాజ రవితేజ ‘డిస్కో రాజా’ లేటెస్ట్ టీజర్ ఎప్పుడు..?

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (11:34 IST)
మాస్ మహారాజ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా డిస్కో రాజా. ఈ సినిమాని ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి రెండు సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్‌లో రిలీజ్ చేసారు. ఈ సాంగ్స్ అండ్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న డిస్కో రాజా సినిమా లేటెస్ట్ టీజర్ ని 2.0 పేరుతో ఈనెల 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్  ప్రకటించింది.
 
రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. డిస్కో రాజా సినిమా లేటెస్ట్ టీజర్‌కు ఎస్‌ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తుండగా కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. 
 
కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని ఈనెల 24వ తేదీన గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేస్తోంది సినిమా యూనిట్. రవితేజ ఇటీవల కాలంలో కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. హిట్టు సినిమా కోసం చూస్తున్నాడు. దీని పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి... రవితేజకు ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments