Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ, ధమాకా థియేట్రికల్ ట్రైలర్ తేదీ ప్రకటించారు

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (18:08 IST)
Ravi Teja new still
రవితేజ,  త్రినాధరావు నక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా' టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్‌ వచ్చింది. దాదాపు ప్రతి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. జింతాక్, దండకడియాల్ ట్రాక్‌లు మాస్ ని అలరిస్తున్నాయి. సక్సెస్ఫుల్ మ్యూజికల్ ప్రమోషన్ల తర్వాత మేకర్స్ ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల తేదీని ప్రకటించారు.
 
డిసెంబర్ 15న ధమాకా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో రవితేజ క్లాస్ అవతార్‌లో సూట్‌లో కళ్లజోడుతో కనిపించారు. ఇందులో క్లాస్ , మాస్ అవతార్‌లలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. రెండు పాత్రలు వినోదాత్మకంగా ఉండబోతున్నాయి. సినిమాలో యాక్షన్, ఇతర అంశాలతో పాటు హై ఎంటర్ టైన్మెంట్ వుండబోతుంది.  
 
శ్రీలీల కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న' ధమాకా' భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధమాకా డిసెంబర్ 23న  ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments