Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధమాకా నుండి రవితేజ, శ్రీలీల పై చిత్రించిన డు డు సాంగ్ విడుదల

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (15:25 IST)
Raviteja song
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
 
ధమాకా నుండి విడుదలైన డు డు సాంగ్  ప్రోమో పాటపై అంచనాలు పెంచింది. ఈ రోజు పూర్తి పాట విడుదలైయింది. భీమ్స్ సిసిరోలియో ఈ పాటని మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే ఎక్స్ టార్డినరీ మాస్ నెంబర్ గా కంపోజ్ చేశారు.  
 
ఈ పాటలో రవితేజ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్, స్వాగ్ మైండ్ బ్లోయింగా వున్నాయి. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ రోల్ ని తెలియజేస్తోంది. ఈ పాటని పృధ్వీ చంద్ర ఫెంటాస్టిక్ గా ఆలపించారు.
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.
 
డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.
 
తారాగణం: రవితేజ, శ్రీలీల
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments