Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ, శ్రీలీల ధమాకా ప్రమోషన్ కు తంటాలు

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (15:53 IST)
Ravite new look
మాస్ మహారాజా రవితేజ ధమాకా ప్రమోషన్ కు తంటాలు మొదలయ్యాయి. సినిమా ఆరంభం నుంచి రకరకాలుగా ప్రమోషన్ చేస్తున్నారు.   ఇక ఓ సాంగ్ కోసం మూడు రోజులపాటు ప్రమోషన్ మొదలుపెట్టారు. సాంగ్ రాబోతున్నదమ్ టూ ఓ సారి గుర్తు చేశారు. అందులో భాగంగా అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రవితేజ్ లుక్ విడుదల చేశారు. తర్వాత మోషన్ పోస్టర్ వచ్చింది. ఇప్పుడు ప్రోమో బయట పెట్టారు. ఆ తర్వాత 25న పాట సగం రామోతున్నది.  తర్వాత మొత్తం పాట విడుదల చేస్తారు. 
 
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
 
ధమాకా నుండి  డు డు సాంగ్ ని నవంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇటివలే ప్రకటించిన టీం తాజాగా ప్రోమోని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో మరో డ్యాన్సింగ్ నెంబర్ గా డు డు పాటని కంపోజ్ చేశారని ప్రోమో చూస్తే అర్ధమౌతోంది. ప్రోమోలో రవితేజ చేసిన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్ పాటపై అంచనాలని పెంచింది. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, పృధ్వీ చంద్ర ఆలపించారు.
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే,  సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.
డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments