Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల తర్వాత రవితేజ-ఇలియానా ఇరగదీస్తున్నారుగా(Video)

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (17:43 IST)
తెలుగు సినిమాలలో ఇలియానా కనిపించి 6 సంవత్సరాలు దాటిపోయింది. 2005 సంవత్సరంలో తెలుగు తెరకు పరిచయమైన ఈ గోవా సుందరి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి, నటిగా మంచి పేరు సంపాదించుకుంది. 2012లో రిలీజైన జులాయి, దేవుడు చేసిన మనుషులు చిత్రాలతో తెలుగు సినిమాకు బై చెప్పి, హిందీలో సినిమాల్లో నటించింది. అక్కడ కూడా మంచి నటిగా నిరూపించుకున్నప్పటికీ సినిమా అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. 
 
అంతేకాకుండా ఆమె వ్యక్తిగత జీవితంలోనూ తన బాయ్‌ఫ్రెండ్ విషయంలో బాగా పాపులారిటీ వచ్చింది. అయితే తాజాగా ఇలియానా మళ్లీ తెలుగులో హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తోంది. రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. రవితేజ, ఇలియానా ఇద్దరూ రెండు చిత్రాల్లో కలిసి నటించారు. 
 
వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాల్లో ఇది హ్యాట్రిక్ చిత్రంగా నిలవబోతోంది. పైగా రవితేజ-శ్రీనువైట్లది కూడా సూపర్ హిట్ కాంబినేషన్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ రోజు రిలీజైంది. ఈ చిత్రం నవంబర్ మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రంగస్థలం సినిమా విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చూడండి ఈ వీడియోను...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments