Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ పుట్టినరోజున రావణాసుర సెకండ్ సింగిల్

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (13:13 IST)
Ravanasura new look
రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి  టీమ్‌వర్క్స్‌పై రూపొందుతున్న ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో ఈసారి థ్రిల్ చేయడానికి సిద్ధంగా వున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రానికి నిర్మాతలు. రవితేజ పుట్టినరోజున రావణాసుర డిఫరెంట్ షేడ్స్ చూపించే ఒక గ్లింప్స్ విడుదల చేయడం ద్వారా ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. ఇటీవల  హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన థీమ్ సాంగ్‌ను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్  ప్రమోషన్‌లను స్టార్ట్ చేశారు. ఎలక్ట్రిఫైయింగ్,  వైబ్రెంట్ ట్రాక్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచింది.
 
హర్షవర్ధన్ రామేశ్వర్‌తో పాటు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ రోజు మేకర్స్ రెండవ సింగిల్ ప్యార్ లోన పాగల్ లిరికల్ వీడియోను ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు. షేడ్స్‌తో బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన రవితేజ పోస్టర్‌లో అల్ట్రా-స్టైలిష్‌గా కనిపిస్తు గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్ తో ఆకట్టుకున్నారు.  
 
సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.
 
సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో  అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు.  
 
విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
ఏప్రిల్ 7,2023న రావణాసురు గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

యూఎస్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని చేతికి సంకెళ్లు వేసి అలా కట్టిపడేశారు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments