Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ ఇంటి కోడలు కావాలంటున్న 'భీష్మ' భామ

Webdunia
గురువారం, 13 మే 2021 (12:51 IST)
'ఛలో' చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన్నా. 'గీతగోవిందం' చిత్రంతో ఈమె క్రేజ్ అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'లో నటిస్తోంది. 
 
అయితే, ఇటీవలే కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. హీరో కార్తీ నటించిన 'సుల్తాన్‌' సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిగా నటించి, ప్రతి ఒక్కరితో శభాష్‌ అనిపించుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మాట్లాడుతూ, తమిళ సంప్రదాయం, సంస్కృతి చాలా విభిన్నంగా ఉంది. ఇది నన్ను ఎంతగానో ఆకర్షించింది. ముఖ్యంగా ఇక్కడి భోజనం, వంటలు చాలా రుచికరంగా ఉన్నాయి. తమిళ వంటకాలంటే అమితమైన ఇష్టం. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలన్నదే నా కోరిక అని చెప్పుకొచ్చింది. సో... రష్మిక కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

పాక్‌లోని ప్రతి అంగుళం మా గురిలోనే ఉంది.. దాడి చేస్తే కలుగులో దాక్కోవాల్సిందే : ఎయిర్ డిఫెన్స్ డీజీ

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments