Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (15:32 IST)
Rashmika Mandanna
యాక్టర్  ధనుష్ తన 51వ సినిమాను టాలీవుడ్ మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ములతో చేస్తున్నారు. ఇటివలే ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్  వచ్చింది. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ క్రేజీ ప్రాజెక్ట్ #D51ని తమ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ )లో అమిగోస్ క్రియేషన్స్  ప్రైవేట్ లిమిటెడ్ కలసి నిర్మిస్తున్నారు.  సోనాలి నారంగ్  ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించనున్నారు. ధనుష్, శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పితో రష్మిక మందనకు ఇదే ఫస్ట్ అసోషియేషన్. ఈ సందర్భంగా రష్మిక మందన్న తన ఆనందాన్ని పంచుకుంటూ.. చాలా ఎక్సయిటెడ్ గా వుంది. ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను’’ అని #D51 ఫోటో ఫ్రేం ని ప్రజంట్ చేశారు.
 
అసాధారణమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి యూనిక్ సబ్జెక్ట్ రాసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో  ప్రముఖ తారాగణం భాగం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

లక్ష ఇచ్చి ఆరేళ్ల పాటు సంసారం చేసిన ఆంటీని లేపేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments