Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప'లో రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ రిలీజ్

#Pushpa Movie
Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (09:57 IST)
అల్లు అర్జున్ - కె.సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ చిత్రం సినిమా ప్రమోషన్ అంతా ఓ ప‌ద్ధ‌తి ప్రకారం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ లుక్ విడుదల చేశారు. ఒకటి కాదు రెండుసార్లు బన్నీకి సంబంధించిన లుక్స్ విడుదలయ్యాయి. 
 
గతేడాది బన్నీ పుట్టిన రోజున పుష్ప ఫస్ట్ లుక్ విడుదలైంది. అలాగే ఈ పుట్టిన రోజున టీజర్ విడుదల చేశారు. అందులో కేవలం అల్లు అర్జున్‌ను మాత్రమే ఫోకస్ చేశారు. ఈ మధ్యే ఫహాద్ ఫాజిల్ లుక్ కూడా విడుదలైంది. హీరో, విలన్ లుక్స్ అయిపోయాయి.. ఇప్పుడు హీరోయిన్ రష్మిక మందన లుక్ బయటికి వచ్చింది. 
 
సెప్టెంబర్ 29న రష్మిక ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఉదయం 9.45 నిమిషాలకు రష్మిక ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ లుక్ అదిరిపోయేలావుంది. నిజానికి గతంలో తన సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. కానీ కాలంతో పాటు ఆయన కూడా మారిపోయారు. రంగస్థలం నుంచి మనసు మార్చుకున్నాడు. అందుకే పుష్పలో రష్మిక మందన్న క్యారెక్టర్‌ను బలంగా తీర్చిదిద్దినట్టు సమాచారం. ఇందులో రష్మిక శ్రీవల్లిగా నటిస్తుంది.
 
ఇప్పటివరకు కేవలం గ్లామర్ క్యారెక్టర్స్ మాత్రమే చేసుకుంటూ వచ్చిన రష్మిక.. పుష్పలో మాత్రం పూర్తిగా డీ గ్లామరైజ్డ్‌గా కనిపిస్తుంది. ఇందులో అల్లు అర్జున్ భార్యగా కనిపించబోతోంది. సినిమా అంతా రాయలసీమ నేపథ్యంలోనే సాగనుంది. ఇందులో చిత్తూరు యాసలో హీరోహీరోయిన్ల మధ్య డైలాగులు ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు వద్దు : ఏపీ హైకోర్టు

భూలోక స్వర్గాన్ని తలపించే తిరుమల కొండలు.. హిమపాతంతో అద్భుతం (video)

రైలులో మైనర్ బాలికకు లైంగిక వేధింపులు.. వీడియో తీసిన దుండగుడు..

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments