Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

ఠాగూర్
సోమవారం, 2 డిశెంబరు 2024 (12:20 IST)
'పుష్ప-2' చిత్రం నుంచి తాజాగా రిలీజ్ చేసిన ఫీలింగ్ లిరికల్ పాట చాలా కష్టమైన పాట అని కానీ, దాన్ని చేస్తూ ఎంతానో ఎంజాయ్ చేసినట్టు ఆ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్నా చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 5వ తేదీన విడుదలాకనుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పుష్ప-2 మేనియా కొనసాగుతుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, తాజాగా ఆ చిత్రంలోని ఫీలింగ్స్ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ - రష్మిక మందన్నాల ఊరమాస్ డ్యాన్స్ అదిరిపోయింది. 
 
ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాట ఆరంభంలో వచ్చే మలయాళ లిరిక్స్‌ను సీజు తురావూర్ రచించారు. ఈ పాటలో బన్నీ, రష్మిక ఫుల్ ఎనర్జటిక్ స్టెప్పులతో ఇరగదీశారు. ఈ పాట విడుదలైన కొన్ని క్షణాల్లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ పాటపై హీరోయిన్ రష్మిక 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తన కెరీర్‌లోనే ఇప్పటివరకూ ఇదే అత్యంత కష్టమైన సాంగ్ అని ఆమె ట్వీట్ చేశారు.
 
'పీలింగ్స్ సాంగ్ ఫుల్ వైబ్, ఫుల్ మాస్. నేను ఇప్పటివరకు చేసిన అత్యంత కష్టతరమైన పాట ఇదే. నన్ను ఎవరైనా ఎత్తుకుంటే నాకు చాలా భయం. అల్లు అర్జున్ వల్ల ఆ భయాన్ని దాటాను. చాలా కష్టమైన పాట కానీ ఎంజాయ్ చేశాను. అల్లు అర్జున్‌తో ఈ పాట చేయడం చాలా కష్టం కానీ సరదాగా గడిచిపోయింది. ఈ సాంగ్ మీచేత థియేటర్లలో చిందులు వేయించడం ఖాయం' అంటూ రష్మిక ట్వీట్ చేశారు.
 
ఇక ఈ ట్వీట్‌రై స్పందించిన బన్నీ.. 'యూ రాక్డ్' అని బదులిచ్చారు. కాగా, ఇప్పుడీ పాట యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. విడుదలైన గంటలోనే 2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. ఇక 'పుష్ప-2: ది రూల్' అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణాలో బెన్ఫిట్ షో టిక్కెట్ ధర రూ.2000 కాగా, సెకండ్ క్లాస్ ధర రూ.1500, థర్డ్ క్లాస్ ధర రూ.800గా విక్రయిస్తున్నారు. 

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

వియ్యంకులకు కీలక పదవులు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments