అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం "రారండోయ్ వేడుక చూద్దాం". ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో సినీ నటుడు చలపతిరావు చేసిన వివాదాస్పద
అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం "రారండోయ్ వేడుక చూద్దాం". ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో సినీ నటుడు చలపతిరావు చేసిన వివాదాస్పద కామెంట్స్ టాలీవుడ్‌లో రచ్చరచ్చగా మారిన విషయం తెల్సిందే.
అయితే, ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలలో మాత్రం హీరో నాగ చైతన్య ఓ డైలాగ్ చెపుతూ ఇందులో నీతి ఏంటంటే.. మనశ్శాంతికి అమ్మాయిలు హానికరమంటూ పలుకుతాడు. ఈ చిత్రంలో హీరో మాత్రం ఇలాంటి డైలాగ్ చెపుతుంటే.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం మరోలా సెలవిస్తున్నారు.
చలపతిరావు వివాదం తర్వాత ఆమె స్పందిస్తూ ఈ సినిమాలోని ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అనే డైలాగ్‌పై స్పందించింది. తనను ఎవరైనా అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా? అని అడిగితే అబ్బాయిలు పాయిజనెస్ అని చెబుతానని సరదాగా చెప్పింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.
ఇప్పటివరకు తాను ఏ సినిమాలోనూ కనిపించనటువంటి పాత్రంలో ఈ సినిమాలో కనపడుతున్నానని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. ఈ సినిమాలో తన పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని చెప్పింది. తాను తెలుగు నేర్చుకుంటానని, తెలుగు సినిమాల వల్లే తాను ఎంతో గుర్తింపు తెచ్చుకున్నానని తెలిపింది. ఈ సినిమాలో ఓ ఇన్నోసెంట్ లవ్‌స్టోరీని చూస్తారని చెప్పింది.
అలాగే హీరో చైతూ మాట్లాడుతూ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా చేస్తున్నప్పుడు తాను మొదట భయపడ్డానని, ఎందుకంటే, ఈ తరహా చిత్రంలో నటించడం తనకు ఇదే మొదటి సారి అని, ఇప్పుడు ఆ భయం పోయిందని ప్రముఖ నటుడు నాగ చైతన్య అన్నాడు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అన్నాడు. భ్రమరాంబ పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ నటన బాగుందని, ఏ హీరోయిన్ రకుల్ పాత్రను అంత అద్భుతంగా పోషించలేదని కితాబు ఇచ్చాడు.