బాలీవుడ్ అపరచితుడుగా రణ్‌వీర్ - శంకర్ ప్రకటన

Webdunia
బుధవారం, 14 ఏప్రియల్ 2021 (13:37 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కనుంది. ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా నటించబోతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పెన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థపై డా.జ‌యంతిలాల్‌ గడ నిర్మించబోతున్నారు. 
 
తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా దర్శకుడు శంకర్, నిర్మాత జ‌యంతిలాల్‌, హీరో ర‌ణ్‌వీర్ సింగ్ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు. త్వరలో ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయని సమాచారం. 
 
కాగా, గతంలో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన అన్నియన్ (అపరచితుడు) ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విక్ర‌మ్ మూడు విభిన్నమైన పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. 
 
ఇక శంకర్ కెరీర్‌లో కూడా అపరచితుడు ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయిది. రామానుజం, రెమో, అపరిచితుడుగా.. విక్ర‌మ్ నటన మహా అద్భుతం. ఈ కథ కేవలం విక్రమ్ కోసమే తయారైనట్టు సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడ్డారు. 
 
ఇక ఈ సినిమాకి హారీస్ జయరాజ్ అందించిన సంగీతం సినిమా రేంజ్‌ని మరో స్థాయికి తీసుకు వెళ్ళింది. 2005లో తమిళంలో వచ్చిన అన్నియన్ అదే సమయంలో తెలుగు డబ్బింగ్ సినిమా అపరిచితుడుగా వచ్చి సెన్షేషనల్ హిట్ సాధించింది. ఈ చిత్రాన్నే శంకర్ ఇపుడు హిందీలోకి అనువదించనున్నారు. 
 
కాగా శంకర్ - మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్‌లో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక పాన్ ఇండియన్ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాడు. అలాగే కమల్ హాసన్‌తో శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 కూడా పూర్తి కావాల్సి ఉంది.  

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments