Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాం చరణ్ "రంగస్థలం" రెండోపాటకు టైమ్ ఫిక్స్ చేశారు... (Video)

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌, హీరోయిన్ స‌మంత హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర "రంగస్థలం". పూర్తిగా ప‌ల్లెటూరి నేప‌థ్యంలో ఈ చిత్రం తెరకెక్కించారు.

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (12:23 IST)
మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌, హీరోయిన్ స‌మంత హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర "రంగస్థలం". పూర్తిగా ప‌ల్లెటూరి నేప‌థ్యంలో ఈ చిత్రం తెరకెక్కించారు. ఈనెల 30వ తేదీన విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్స్‌తో పాటు సాంగ్‌కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. 
 
ఇక శుక్రవారం సాయంత్రం 6 గంట‌ల‌కి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతంలో రూపొందిన రెండో సాంగ్‌ని విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ కొద్ది సేప‌టి క్రితం పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. 
 
తొలి పాట‌లో 'వేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకేబిందెలాగ ఎంతసక్కగున్నావే.. లచిమి ఎంత సక్కంగున్నావే, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే చేతికి అందిన చందమామలాగ ఎంత సక్కగున్నావే..లచిమి' అంటూ పల్లెటూరు అమ్మాయిని పొగుడ్తూ రాసిన పాట చాలా బాగుంది.  
 
గేయ రచయిత చంద్రబోస్ ఈ పాటను రాయగా.. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. దీంతో రెండో పాటపై కూడా భారీ అంచనానే నెలకొన్నాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

6 నిమిషాల్లో 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను పట్టేసిన మహిళ (video)

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments