Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

ఠాగూర్
సోమవారం, 7 జులై 2025 (10:31 IST)
టాలీవుడ్ అగ్ర హీరో మహేశ్ బాబుకు వినియోగదారుల ఫోరం కోర్టు నోటీసులు జారీచేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు మహేశ్ బాబు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాురు. దీంతో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఈ నోటీసులు జారీచేసింది. 
 
మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త సినీనటుడు మహేశ్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది.
 
కేసు వేసిన ఓ వైద్యురాలు, మరో వ్యక్తి.. రెండో ప్రతివాది మాటలు నమ్మి బాలాపూర్ గ్రామంలో చెరో ప్లాట్ కొనడానికి రూ.34,80,000 చెల్లించారు. అన్ని అనుమతులు ఉన్నాయని, మహేశ్ బాబు ఫొటోతో ఉన్న బ్రోచర్ వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బు చెల్లించినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. 
 
తర్వాత లేఅవుట్ లేదని తెలుసుకొని డబ్బు తిరిగి ఇవ్వమంటే రెండో ప్రతివాది అతికష్టం మీద కేవలం రూ.15 లక్షలు మాత్రమే వాయిదాల్లో ఇచ్చారు. అనంతరం ఆలస్యం చేస్తూ ముఖం చాటేయడంతో మిగతా డబ్బు ఇప్పించమని ఫిర్యాదుదారులు కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో మహేశ్ బాబుతో పాటు మిగిలిన వారికి కోర్టు నోటీసులు పంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలు రాజ్యాంగబద్ధమే అంటున్న న్యాయ నిపుణులు!

భార్యపై అనుమానమా? క్షుద్రపూజలు చేశాడా? భార్యను బండరాళ్లతో కొట్టి హత్య

మాజీ సీజేఐను బంగళా ఖాళీ చేయించాలి.. కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు

12ఏళ్లు డ్యూటీ చేయని కానిస్టేబుల్.. జీతం మాత్రం రూ.28లక్షలు తీసుకున్నాడు..

Amarnath Yatra: నాలుగు రోజుల్లో అమర్‌నాథ్ యాత్రలో 70,000 మంది భక్తులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments