Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా, మిహీకాల పెళ్లి సందడి.. ఆ రోజు రానే వచ్చింది.. ఒకే ఫ్రేములో..?

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (11:47 IST)
Rana_mihika
టాలీవుడ్ 'రానా, మిహీకాల పెళ్లి సందడి మొదలైంది. ఇప్పటికే రానా వివాహానికి సంబంధించిన మెహందీ, హల్దీ కార్యక్రమాలకు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీరి పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు నాగ చైతన్య, సమంత, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, దిల్ రాజు, సుబ్బిరామిరెడ్డి, రాజమౌళి, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందినట్టు సమాచారం. 
 
అయితే రాజమౌళికి కరోనా సోకడంతో ఆయన వచ్చే అవకాశాలు లేవు. మొత్తంగా రానా, మిహీకాల పెళ్లి చేసుకోబోతున్న సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారికి శుభాకాంక్షల తెలుపుతున్నారు.
 
ఇక వధువు మెడలో తాళికట్టు శుభవేళ గంటల్లో రానుంది. దాంతో రానా దగ్గుబాటి, తన స్నేహితురాలు మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. ఈ వేడుకకు కేవలం 50 మంది లోపు అతిథులు పాల్గొనే అవకాశం ఉంది. 
 
ఈ సందర్భంగా రానా దగ్గుబాటి, బాబాయి వెంకటేష్, తండ్రి సురేష్‌ బాబుతో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఇప్పటికే పెళ్లికి హాజరయ్యేవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని దగ్గుబాటి ఫ్యామిలీ కోరింది. ఈ పెళ్లి వేడుకకు రామానాయుడు సినీ విలేజ్ స్టూడియోలో బయో సెక్యూర్ వాతావరణంలో పెళ్లి తంతును నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

పడక గదిలోకి వచ్చిన ఆవు - ఎద్దు : కప్‌బోర్డులో దాక్కున్న మహిళ (Video)

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments