Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు 'సుల్తాన్' రానా... 'కలియుగ భీమ'గా ప్రేక్షకుల ముందుకు వస్తాడట!

టాలీవుడ్ హీరోల్లో మెలితిరిగిన కండల వీరుడిగా పేరుగాంచిన హీరో కమ్ విలన్ దగ్గుబాటి రానా. ఈ కుర్రోడు.. బాహుబలిలో విలన్‌గా తన ప్రతాపం చూపించాడు. అందుకే రానాను తెలుగు సుల్తాన్‌గా ప్రతి ఒక్కరూ పిలుచుకుంటారు.

Webdunia
మంగళవారం, 12 జులై 2016 (12:18 IST)
టాలీవుడ్ హీరోల్లో మెలితిరిగిన కండల వీరుడిగా పేరుగాంచిన హీరో కమ్ విలన్ దగ్గుబాటి రానా. ఈ కుర్రోడు.. బాహుబలిలో విలన్‌గా తన ప్రతాపం చూపించాడు. అందుకే రానాను తెలుగు సుల్తాన్‌గా ప్రతి ఒక్కరూ పిలుచుకుంటారు. ఈ నేపథ్యంలో రానా ఓ పాత్రపై మనసు పారేసుకున్నాడట.
 
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్లు చేసిన మల్లయోధుల తరహా పాత్రను తాను కూడా చేసేందుకు అమితాసక్తిని చూపుతున్నాడు. సల్మాన్ హీరోగా తెరకెక్కిన 'సుల్తాన్' ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించింది. అదేసమయంలో అమీర్ హీరోగా తెరకెక్కిన 'దంగల్'పై కూడా భారీ అంచనాలే నెలకొనివున్నాయి. పైగా, ఈ రెండు సినిమాలు నిజ జీవిత కథలతో తెరకెక్కినవే. రెండు సినిమాల్లోనూ హీరోలు మల్లయోధులుగానే కనిపిస్తున్నారు. 
 
దీంతో అదే తరహా పాత్ర చేసేందుకు ఈ టాలీవుడ్ కండల వీరుడు ఆసక్తి కనబరుస్తున్నాడు. కుస్తీ పోటిల్లో కలియుగ భీమగా పేరు తెచ్చుకున్న విజయనగరానికి చెందిన కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథతో సినిమాను తెరకెక్కిస్తే అందులో నటించేందుకు తాను సిద్ధమంటూ రానా స్వయంగా ప్రకటించాడు. ఇక దర్శక నిర్మాతలు ఊరుకుంటారా. త్వరలోనే రానా లీడ్ రోల్‌లో కలియుగ భీమ పట్టాలెక్కే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments