Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో దగ్గుబాటి రానాకు ఆ వ్యాధి ఉందట... మరణానికి 30 శాతం ఛాన్సెస్??? (video)

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (07:37 IST)
ప్రముఖ టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా ప్రతి ఒక్కరూ విస్తుపోయే వార్తను వెల్లడించాడు. తన ఆరోగ్యంపై గత కొంతకాలంగా వస్తున్న పుకార్లపై ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా, అసలు తనకు ఉన్న జబ్బు ఏంటో బహిర్గతం చేశారు. పైగా, తనకు మరణం సంభవించే అవకాశాలు 30 శాతం మేరకు ఉన్నట్టు తెలిపారు. 
 
టాలీవుడ్ సినీ నట సమంత అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'సామ్‌జామ్' రానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. పుట్టినప్పటి నుంచి తనకు బీపీ ఉందని, దీనివల్ల గుండె సమస్య తలెత్తిందన్నారు. 
 
ముఖ్యంగా తనకు కిడ్నీలు పాడవుతాయని వైద్యులు చెప్పారని, అలాగే, మెదడులో నరాలు చిట్లిపోవడానికి (స్ట్రోక్ హెమరేజ్) 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉందని వైద్యులు చెప్పారంటూ కంటితడి పెట్టాడు. 
 
జీవితంలో వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిన్న పాజ్ బటన్ ఇదన్నారు. రానా కంటతడితో స్పందించిన సమంత.. జనాలు ఏదేదో మాట్లాడుకుంటున్నా, మీరు మాత్రం ధైర్యంగానే ఉన్నారని, ఆ సమయంలో తాను స్వయంగా మిమ్మల్ని చూశానని తెలిపింది.
 
రానాకు కిడ్నీ సమస్య ఉందని, విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాడంటూ ఇటీవల పలు వార్తలు సోషల్ మీడియాతోపాటు ప్రధాన మీడియాలోనూ చక్కర్లు కొట్టిన విషయం తెల్సిందే. దీనికి తోడు ఆయన బాగా సన్నబడడంతో అది నిజమేనని నిర్ధారించారు కూడా. 
 
అయితే, ఆ తర్వాత 'అరణ్య' సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడంతో ఆ సినిమా కోసమే రానా తన బరువు తగ్గించుకుని ఉంటాడని అందరూ భావించారు. అయితే, తన ఆరోగ్యంపై మాత్రం ఎప్పుడూ పెదవి విప్పని రానా.. తాజాగా 'సామ్‌జామ్' కార్యక్రమంలో తన ఆరోగ్యం గురించి చెప్పి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments