Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానాకు దొరికిన లక్కీ చాన్స్ : ఘాజీ ది ఎటాక్

భారతీయ చలనచిత్ర ప్రపంచంలోనే సముద్రగర్భంలో ప్రయాణించే సబ్‌మెరైన్‌ ఇతివృత్తంగా చేసుకుని వస్తున్న తొలి కథ కావడం వల్ల దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ‘ఘాజీ’ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. చరిత్రలో దాగున్న ఒక కొత్త కోణాన్ని బయటికి తీసి.. తెర మీద ప్రదర్శ

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (01:40 IST)
భారతీయ చలనచిత్ర ప్రపంచంలోనే సముద్రగర్భంలో ప్రయాణించే సబ్‌మెరైన్‌ ఇతివృత్తంగా చేసుకుని వస్తున్న తొలి కథ కావడం వల్ల దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ‘ఘాజీ’ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. చరిత్రలో దాగున్న ఒక కొత్త కోణాన్ని బయటికి తీసి.. తెర మీద ప్రదర్శించే భాగ్యం కలగడం మంచి అవకాశమని భావించిన రానా ఈ చిత్రం గురించి ఆఫర్ రాగానే ఎగిరి గంతేశాడు. అందులో తను నేవీ ఆఫీసర్‌. ఈ చిత్రం షూటింగ్ గురించి, ఇతివృత్తం గురించి తన మాటల్లోనే...
 
ఎందుకో ఎవరూ సినిమా కథగా చూడలేదు. నేను చిన్నప్పటి నుంచి వైజాగ్‌ వెళ్లినప్పుడల్లా సముద్రతీరంలో కొలువుతీరిన సబ్‌మెరైన్‌ను చూస్తుంటాను. అలాంటి మెరైన్‌కు విశాఖతీరంలో ఒక యుద్ధ చరిత్ర ఉందన్న సంగతి నాకు తెలియదు. ఆ మాటకొస్తే చాలామంది వైజాగ్‌లో నివసించే వాళ్లకు కూడా తెలియకపోవచ్చు. అయితే అక్కడక్కడ చరిత్రలో దొరికే సమాచారం మాత్రం ఆసక్తి కలిగించేది. సముద్రజలాల్లో గుప్తంగా దాగున్న ఆ చరిత్రను తెర మీద ప్రదర్శించే అవకాశం ఇన్నాళ్లకు కలిగింది.
 
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ సినిమా షూట్‌ చేస్తున్నాం. వీలైనంత వరకు గ్రాఫిక్స్‌ వాడుతున్నాం. కథ గురించి వెనక్కి వెళితే - 1971 డిసెంబర్‌ 3న జరిగిన సంఘటన ఇది. ఇండియా, పాక్‌ల మధ్య యుద్ధం జరిగుతున్నప్పుడు విశాఖ తీరంలో ‘ఘాజీ’ ముక్కలైంది. ఆ యుద్ధనౌకను కూల్చేసే క్రమం ఆసక్తికరంగా సాగుతుంది. ఇదొక ఉద్వేగభరిత కథ. పాకిస్తాన్‌పై భారతీయులు గర్వపడే విజయం. ‘ఘాజీ’కి పెడుతున్న బడ్జెట్‌తో ఏ వాణిజ్యచిత్రమో చేయవచ్చు. కానీ ఇలాంటి కొత్త చిత్రం చేయలేము. నా కెరీర్‌లో ఇదొక మంచి అనుభవం. 
 
దర్శకుడు సంకల్ప రాసిన పుస్తకంతో పాటు సబ్‌మెరైన్స్‌ మీద వచ్చిన కొన్ని పుస్తకాలను అధ్యయనం చేశాము. కొందరు నేవీ కెప్టెన్లను స్ఫూర్తిగా తీసుకుని కథను అల్లుకున్నాము. సముద్రజలాల్లో సాగే కథ కాబట్టి.. ఆ పాత్రలకు ఒక స్వభావాన్ని తీసుకొచ్చేందుకు దర్శకుడు కష్టపడ్డారు. 
 
హిందీ, తమిళ భాషల్లో భిన్నమైన తరహా కథలు వస్తున్నాయిప్పుడు. కొత్త కొత్త జోనర్‌లలో ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు తాజా అనుభూతిని కలిగిస్తున్నాయి. తెలుగులో అలాంటి సినిమాలు చాలా తక్కువ. అలాంటి కొరతను తీర్చే ప్రయత్నంలో భాగంగా వస్తున్నదే ‘ఘాజీ’. హీరోసెంట్రిక్‌ సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు ఉన్నారు. నేను కూడా అదే దారిలో వెళ్లదల్చుకోలేదు. ఏదైనా ఒక ప్రయోగం.. ఒక కొత్త అనుభవం.. మిగిల్చే సినిమాలవైపు చూస్తున్నాను. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments