గుణశేఖర్ - రానా దగ్గుబాటిల "హిరణ్య కశ్యప"

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (16:12 IST)
టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ - రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో ఓ చిత్రంరానుంది. ఈ చిత్రం పేరు "హిరణ్య కశ్యప". ఈ చిత్ర కథపై మూడేళ్ళ పాటు పరిధోనచేసి నిర్మించనున్నారు. నిజానికి స్టార్‌గా కంటే నటుడిగా తనని తాను ఆవిష్కరించుకునేందుకు రానా దగ్గుబాటి నిత్యం ఆరాటపడుతుంటాడు. అందుకే అతను విభిన్న భాషలలో.. భిన్నమైన ప్రాజెక్టులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. 
 
కేవలం హీరోగానే కాదు పాత్రలో వైవిధ్యం ఉంటే చాలు సహయ నటుడిగా సైతం చెలరేగిపోతాడు. రానా సినిమా కోసం ఎంత కష్టపడతాడో 'బాహుబలి', ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. క్యారెక్టర్‌లో జీవించడం కోసం నిత్యం శ్రమిస్తాడు. ఫలితంగానే ఆయన చేతిలో తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. 
 
ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్టులో రానా నటించనున్నారు. టాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ "హిరణ్య కశ్యప" అనే కథతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. పురాణకాలం నాటి కథతో మూవీని తెరకెక్కిస్తున్నారు. హిరణ్య కశ్యప ప్రహ్లాదుడి తండ్రి. రాక్షస జాతికి చెందినవాడు. మూడు సంవత్సరాల పాటు ఈ కథపై పరిశోధన చేసి ఈ చిత్ర కథను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments