Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రెడ్‌ అలర్ట్‌' అవార్డు నిర్మాతకే అంకితం.. మూవీ పెద్ద హిట్ కావాలి.. రానా

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (19:41 IST)
హెచ్‌.హెచ్‌.మహాదేవ్‌, అంజనా మీనన్‌ జంటగా పి.ఎన్‌.త్రిలోక్‌ రెడ్డి సమర్పణలో సినీలయ క్రియేషన్స్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌‌పై చంద్రమహేష్‌ దర్శకత్వంలో దివంగత పి.వి.శ్రీరాంరెడ్డి నిర్మించిన సినిమా 'రెడ్‌ అలర్ట్‌'. ఈ సినిమా ఆడియో విడుదల ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దగ్గుబాటి రానా బిగ్‌ సీడీ, ఆడియో సీడీలను, థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ శ్రీరామ్‌రెడ్డి నాన్నగారికి మంచి స్నేహితుడు. వారి పరిచయంతో నేను ఇక్కడికి వచ్చాను. దక్షిణాది భాషల్లో రూపొందిన ఈ సినిమా ఆడియో, మూవీ పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.
 
అనంతరం వైకాపాకు చెందిన ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఏకకాలంలో నాలుగు భాషల్లో చిత్రీకరించి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించారు. నిర్మాత శ్రీరామ్‌రెడ్డి ఈరోజు మన మధ్య లేకపోయినా ఈ సినిమా రూపంలో బ్రతికే ఉన్నారు. ఈ సినిమా అన్ని బాషలలో పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు. 
 
దర్శకుడు చంద్రమహేష్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాని నాలుగు భాషల్లో తెరకెక్కించినందుకు రెండు అవార్డులు వచ్చాయి. ఆ క్రెడిట్‌ అంతా శ్రీరామ్‌రెడ్డికే చెందుతుంది. ఈ అవార్డులను ఆయనకే అంకితం చేస్తున్నాను. రవివర్మ నాలుగు పాటలను చాలా డిఫరెంట్‌గా అందించాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను కూడా అద్భుతంగా ఉంటుంది. సినిమాలో అందరూ చాలా నేచురల్‌గా నటించారని అన్నారు. 
 
సంగీత దర్శకుడు రవివర్మ మాట్లాడుతూ.. ఈ చిత్రంతో నాలుగు భాషల్లో సినిమాని డైరెక్ట్‌ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అవకాశాన్ని నాకు కలిగించిన శ్రీరామ్‌రెడ్డిగారికి, చంద్రమహేష్‌గారు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!

తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments