Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' దెబ్బకు బాలీవుడ్‌కు నిద్రకరువైంది.. అందుకే దుష్ప్రచారం : రానా

"బాహుబలి" చిత్రం సాధించిన విజయంతో అన్ని చిత్రపరిశ్రమల రికార్డులు గల్లంతైపోయాయి. ముఖ్యంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు నమోదైవున్న అన్ని రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా బాహుబలి చిత్రం విజయంతో

Webdunia
మంగళవారం, 16 మే 2017 (16:58 IST)
"బాహుబలి" చిత్రం సాధించిన విజయంతో అన్ని చిత్రపరిశ్రమల రికార్డులు గల్లంతైపోయాయి. ముఖ్యంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు నమోదైవున్న అన్ని రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా బాహుబలి చిత్రం విజయంతో బాలీవుడ్ ప్రముఖులు ఖిన్నులైపోయారు. నోటమాట రావడం లేదు. బాలీవుడ్ బడా హీరోలు కనీసం సినిమాను మెచ్చుకోవడం పక్కన పెడితే.. నోరు మెదిపి సినిమా గురించి మాట్లాడింది లేదు. పైగా, తమ చిత్రాల రికార్డులే గొప్పగా భావిస్తూ వచ్చిన వారికి నిద్రకరవైంది.
 
ఇక బాలీవుడ్ మీడియా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు బాహుబలి, భల్లాలదేవ క్యారెక్టర్లు బాలీవుడ్ హీరోలకు వెళ్లాయంటూ కథనం రాసేసింది. తొలుత బాహుబలి క్యారెక్టర్ కోసం హృతిక్ రోషన్‌ను, భల్లాలదేవ కేరెక్టర్ కోసం జాన్ అబ్రహాంను రాజమౌళి సంప్రదించాడంటూ ఓ బాలీవుడ్ మీడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసేసింది. 
 
దీనిపై బాహుబలి చిత్రంలో భల్లాలదేవ పాత్రను పోషించిన రానా ఘాటు రిప్లై ఇచ్చాడు. "అదంతా పచ్చి అబద్ధం. సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే ప్రభాస్ అందులో హీరో అయిపోయాడు. ఆ తర్వాత వెంటనే అందులో నేనూ చేరిపోయాను" అంటూ ఆ మీడియా సంస్థకు రిప్లై ఇచ్చాడు రానా. ఆ రిప్లైతో వెంటనే తాను చేసిన తప్పిదాన్ని తెలుసుకుని ఆ ట్వీట్‌ను తొలగించడం ఆ మీడియా సంస్థ వంతైంది. 

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

నాకు తెలిసి జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టరు: ఆర్ఆర్ఆర్

కారు పైకి ఎక్కి నుజ్జు నుజ్జు చేసిన ఏనుగు - video

ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో ప్రయాణించిన సైనిక శునకం

ఈవీఎం ధ్వంసం : వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టుకు ఈసీ ఆదేశం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments