Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గడ్డంపోయింది.. మరో కాలంలోకి వెళ్లేందుకు సిద్ధం'.. రానా

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చెక్కిన 'బాహుబలి' మూవీ శిల్పంలో భళ్లాలదేవగా మెప్పించిన హీరో రానా దగ్గుబాటి. ఈ పాత్రతో ఒక్కసారి అంతర్జాతీయ స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' సిని

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (09:39 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చెక్కిన 'బాహుబలి' మూవీ శిల్పంలో భళ్లాలదేవగా మెప్పించిన హీరో రానా దగ్గుబాటి. ఈ పాత్రతో ఒక్కసారి అంతర్జాతీయ స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. 
 
ప్రస్తుతం రానా మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. '1945' అనే టైటిల్‌తో అనాటి కాలానికి అనుగుణంగా తెరకెక్కబోతున్న మూవీలో రానా నటించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా రానా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తున్నాడు.
 
తాజాగా ఈ సినిమాలో నా లుక్ ఇలా ఉండబోతుందంటూ.. ఓ ఫొటోని షేర్ చేశాడు రానా. ‘మొత్తానికి గడ్డం పోయింది. మరో కాలంలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నా. "1945" సినిమా లుక్ కోసం వర్క్ జరుగుతోంది. నవంబర్‌లో ఫస్ట్‌లుక్ విడుదల చేస్తాం’ అంటూ రానా షేర్ చేసిన ఫొటోకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గడ్డం తీసేసి, బ్లాక్ అండ్ వైట్ మిక్స్‌డ్ హెయిర్‌తో ఉన్న రానా లుక్ నిజంగానే అదిరిపోయింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డ్రైవ్ చేస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఎస్ఐ

Biryani-Chicken Fry కేరళ అంగన్‌వాడీల్లో ఉప్మా వద్దు... బిర్యానీ, చికెన్ ఫ్రై ఇస్తే బాగుండు.. బాలుడి వీడియో వైరల్ (video)

టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్నాక్స్.. సాయంత్రం 6 రకాలు.. రోజుకో రకం

బైక్ దొంగతనాలు.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..టెస్ట్ రైడ్ ముసుగులో..?

ఏపీలో రూపురేఖలు మారిపోనున్న రైల్వే స్టేషన్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

తర్వాతి కథనం
Show comments