Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌బాబు కోసం రామ్‌లక్ష్మణ్‌ సరికొత్త ఫైట్లు !

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (12:33 IST)
Mahesh Babu
హీరో మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేసన్‌లో రూపొందుతోన్న చిత్రం తాజా షెడ్యూల్‌ కు ముహూర్తం ఖరారైంది. జనవరి  18న బుధవారం నుంచి హైదరాబాద్‌ శివార్లో ప్రారంభించ నున్నారు. తొలుత యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఫైట్‌ మాస్టర్లు రామ్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో జరగబోతోంది. అంతకు ముందు కూడా యాక్షన్‌ సన్నివేశాలను మొదటి సారి తీశారు. ఇది రెండో సారి. ఇక సంక్రాంతి యాక్షన్‌ హీరోలుగా రామ్‌ లక్ష్మణ్‌కు పేరు వచ్చేసింది. వాల్తేరువీరయ్యలోనూ, వీరసింహారెడ్డి సినిమాల్లోనూ స్టయిలిష్‌ యాక్షన్‌ దృశ్యాలు తీశారు.
 
ముఖ్యంగా బాలకృష్ణ కుర్చీలో కూర్చొని పెండ్లి మండపం దగ్గర చేసే యాక్షన్‌ కు ప్రేక్షకుల్లో ఆదరణ లభించింది. అందుకే మహేష్‌బాబు సినిమాకు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని చేయనున్నట్లు తెలియజేస్తున్నారు. మహేష్‌బాబు ఫైట్స్‌ అంటే అందరికీ తెలిసిందే. రష్‌గా కాకుండా స్టయిలిస్‌గా వుంటాయి. సినిమా సినిమాకు వేరియేషన్‌ చూపాలని మా అసిస్టెంట్లను, కెమెరామెన్‌, దర్శకుడు, హీరోలతోపాటు లైట్‌ బాయ్‌నుకూడా అడిగి నచ్చితే అప్లయి చేస్తామని రామ్‌ లక్ష్మణ్‌లు పేర్కొన్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏకాంతంగా ఉన్నపుడు వీడియో తీసేందుకు నిరాకరించన వ్యభిచారిణి.. చంపేసిన కామాంధులు...

తన కుమారుడిని ఓపెన్ ఏఐ హత్య చేసింది : తల్లి పూర్ణమ రావు

కోడలిని చంపి ఇంటి ఆవరణలో పాతిపెట్టారు.. బొందపెట్టిన స్థలంపైనే పొయ్యిపెట్టి పిండివంటలు చేశారు..

రంగంపేటలో తమిళ సంప్రదాయ క్రీడా పోటీలు... ఎలా?

ఆగివున్న టిప్పర్‌‍ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... నలుగురి దుర్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments