Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందులో లక్ష్మీపార్వతి విషయాలన్నీ వుంటాయ్... వర్మ(వీడియో)

ఇప్పుడు ఎక్కడ చూసినా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రించనున్న సినిమాలో ఎన్ని మలుపులో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అందులోను లక్ష్మీపార్వతితో పాటు నందమూరి తారకరామారావు చరిత్ర మొత్తాన్ని ఈ సినిమాలో చ

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2017 (20:37 IST)
ఇప్పుడు ఎక్కడ చూసినా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రించనున్న సినిమాలో ఎన్ని మలుపులో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అందులోను లక్ష్మీపార్వతితో పాటు నందమూరి తారకరామారావు చరిత్ర మొత్తాన్ని ఈ సినిమాలో చూపిస్తామని ఇప్పటికే రాంగోపాల్ వర్మ చెప్పారు. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించిన రాంగోపాల్ వర్మ నిర్మాత రాకేష్‌ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. లక్ష్మీపార్వతి గురించి అన్ని విషయాలు సినిమాలో ఉంటాయని చెబుతూనే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాంగోపాల్ వర్మ. 
 
ఎన్‌టిఆర్ జీవితం మహాభారత ఘట్టం లాంటిదన్నారు వర్మ. ఎన్‌టిఆర్ జీవితంలో ఎన్నో ఘట్టాలున్నాయని మొత్తంగా ఆయన గురించి చెప్పాలంటే 20 సినిమాలు చేయాలన్నారు రాంగోపాల్ వర్మ. ఎన్‌టిఆర్ చరిత్రను ఒకే సినిమాలో మొత్తం చరిత్ర వచ్చేటట్లుగా చిత్రీకరించనున్నట్లు చెప్పారు. నిర్మాత రాకేష్‌ రెడ్డి వైసిపి నాయకుడన్న విషయం తనకు తెలియదని, తాను రాజకీయ నాయకుడిని కాదని, సినిమాను సినిమాగానే తీస్తాను తప్ప ఇందులో కల్పితాలు ఉండవన్నారు. 
 
సినిమా అనేది కొంతమందికి నచ్చొచ్చు.. మరికొంతమందికి నచ్చకపోవచ్చు అంతమాత్రాన అందరికి నచ్చే విధంగా సినిమా తీయడం తన వల్ల కాదన్నారు. లక్ష్మీస్ ఎన్‌టిఆర్ సినిమాలో హీరోహీరోయిన్లు ఇంతవరకు ఎవరనేది నిర్ణయించుకోలేదని, మార్చి నెలలో షూటింగ్ ప్రారంభమై అక్టోబర్ నెలలో సినిమాను పూర్తి చేస్తామన్నారు. వీడియో చూడండి...
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments