Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' రికార్డు బద్దలు... బాబాయ్ 'అజ్ఞాతవాసి' కోసం సంక్రాంతి వరకూ ఆగలేను...

తెలుగు చిత్రసీమలో బాహుబలి రికార్డు అంతాఇంతా కాదు. తెలుగు చిత్రాల్లోనే ఒక భారీ హిట్‌గా పేరు సంపాదించుకుంది. రికార్డుల మీద రికార్డులను సాధించింది బాహుబలి సినిమానే. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా టీజర్ అప్పట్లో యూ ట్యూబ్‌లో లక్షల మంది చూశ

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (20:07 IST)
తెలుగు చిత్రసీమలో బాహుబలి రికార్డు అంతాఇంతా కాదు. తెలుగు చిత్రాల్లోనే ఒక భారీ హిట్‌గా పేరు సంపాదించుకుంది. రికార్డుల మీద రికార్డులను సాధించింది బాహుబలి సినిమానే. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా టీజర్ అప్పట్లో యూ ట్యూబ్‌లో లక్షల మంది చూశారు. రెండు రోజుల్లోనే లక్షల మంది బాహుబలి టీజర్‌ను చూస్తే అప్పట్లో అది రికార్డుగా నిలిచింది. అయితే ఆ రికార్డును ఇప్పుడు పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా బద్దలు కొట్టింది.
 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, హీరో పవన్ కళ్యాణ్‌ నటించిన సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ను 5 గంటల్లో 30 లక్షల 11 వేల మంది తిలకించగా 17 గంటల్లో 40 లక్షల 26 వేల మంది తిలకించారు. ఒక్కరోజుకు 50 లక్షల మంది వీక్షించగా రెండవ రోజు కోటి దాటింది. యూ ట్యూబ్‌లో ఈ టీజర్‌ను ఇన్ని లక్షల మంది వీక్షించడం సినిమా యూనిట్‌నే ఆశ్చర్యపరుస్తోంది. ఈ నెల 19న అజ్ఞాతవాసి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరుగనుండగా, వచ్చే నెల 10వ తేదీన సినిమా విడుదల కానుంది.
 
కాగా ఈ టీజర్ చూసిన చెర్రీ... బాబాయ్, ఈ చిత్రాన్ని చూసేందుకు సంక్రాంతి పండుగ వరకూ ఆగలేను అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments