Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఛాన్సులొస్తాయిని భర్తకు దూరమయ్యా.. కథ అడ్డం తిరిగింది... రోడ్డునపడ్డా : సినీ నటి రంభ

టాలీవుడ్ నటి రంభ అలియాస్‌ విజయలక్ష్మి... ఓ సాదాసీదా అమ్మాయి. అలాంటి అమ్మాయి ఏదో ఒకరోజు వెండితెర ఏలుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి అమ్మాయి వంద సినిమాల్లో నటించింది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ రంభ అంద

Webdunia
శనివారం, 21 జనవరి 2017 (10:33 IST)
టాలీవుడ్ నటి రంభ అలియాస్‌ విజయలక్ష్మి... ఓ సాదాసీదా అమ్మాయి. అలాంటి అమ్మాయి ఏదో ఒకరోజు వెండితెర ఏలుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి అమ్మాయి వంద సినిమాల్లో నటించింది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ రంభ అందం చిందులు వేసింది. ఆ తర్వాత ఆ అందం ఉత్తరాదికి చేరి, అక్కడ ఎంతో మందికి బంధం వేసింది. నటిగా ఎంతోమందిని ఆకట్టుకున్న రంభ భర్తను మాత్రం కొంగున ముడివేసుకోలేకపోయింది. పెళ్ళయిన కొంతకాలానికే విడాకులు కోసం కోర్టు మెట్లు ఎక్కింది. 
 
తన వైవాహిక జీవితంపై ఆమె స్పందిస్తూ... ఇంద్రన్‌తో నా వివాహం సరైన సమయంలోనే జరిగింది. హీరోయిన్‌గా చేస్తుండగానే తనతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. అప్పట్లో ఇంద్రన్‌ నా సర్వస్వం అనుకున్నాను. తను లేకపోతే నేను లేను. అంతలా తనని ప్రేమించాను. పెళ్ళయిన కొత్తల్లో అత్తింటి వారు ఇబ్బంది పెట్టినా మేం మాత్రం బాగా ఉండేవాళ్ళం. రెండో పాప పుట్టిన తర్వాత అత్తింటి వేధింపులు తారాస్థాయికి చేరాయి. దాంతో మా మధ్య విభేదాలు మొదలయ్యాయి. మా మధ్య సఖ్యత కుదిర్చేవారి కన్నా మంట పెట్టేవారే ఎక్కువయ్యారు. దాంతో మా మధ్య దూరం పెరిగిపోయింది. 
 
ఇక తనతో కలిసి ఉండలేక కెనడా వదిలి ఇద్దరు పిల్లలతో చెన్నై వచ్చేశాను. ఇక్కడికి రాగానే అవకాశాలు వస్తాయని ఏమీ ఊహించలేదు కానీ, కొద్దిగా ఆలస్యం అయినా నన్ను మళ్ళీ ఆదరిస్తారని అనుకున్నాను. కానీ నా అంచనా తప్పయింది. దాంతో విధిలేని పరిస్థితిలో భరణం కోసం కోర్టు మెట్లెక్కాల్సి పరిస్థితి వచ్చింది. అదీ నా పిల్లల కోసమే తప్ప నా కోసం కాదు. నా భర్తతో విడిపోవాలని తీసుకున్న నిర్ణయం పూర్తిగా నా సొంతం. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఎవరి మాటలు విని నేను ఈ పని చేయలేదు. పరిస్థితులు అలా వచ్చాయని వివరించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments