Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెన‌డా ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ నిర్మించిన తొలి తెలుగు చిత్రం రామ‌స‌క్క‌ని రాకుమారుడు..

Webdunia
శనివారం, 28 నవంబరు 2015 (20:22 IST)
నూత‌న న‌టీన‌టులు ఉద‌య్, స‌ప్న జంట‌గా ఉద‌య్ క‌ల్లూరి తెర‌కెక్కించిన చిత్రం రామ‌స‌క్క‌ని రాకుమారుడు. కెన‌డా బేస్డ్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. కెన‌డా బ్యాక్డ్రాప్‌లో కెన‌డా బేస్ట్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ నిర్మించిన తొలి తెలుగు చిత్రం రామ‌స‌క్క‌ని రాకుమారుడు కావ‌డం విశేషం. యువ సంగీత ద‌ర్శ‌కుడు హేమ చంద్ర ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. మధుర ఆడియో ద్వారా డిసెంబ‌ర్ 5న కెన‌డాలోని టోరోన్టో‌లో ఆడియో రిలీజ్ చేయ‌నున్నారు. ఇటీవ‌ల రామ‌స‌క్క‌ని రాకుమారుడు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ మ‌రియు టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్కి అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది.
 
ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ ఉద‌య్ క‌ల్లూరి మాట్లాడుతూ...సామాజిక, సాంస్కృతిక తేడాల‌ వ‌ల‌న‌  పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు రిలేష‌న్ షిప్ పై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాయ‌నే సందేశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాను. కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా...ఇలా ప్రేక్ష‌కులు కో్రుకునే అన్ని అంశాల‌తో పాటు ఎన్.ఆర్.ఐ ప్రేక్ష‌కుల‌కు చ‌క్క‌ని సందేశం కూడా ఉంది. 150 నిమిషాల నిడివి గ‌ల ఈ సినిమాలో మూడు పాట‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. నిర్మాత హారిక క‌ల్లూరి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా జ‌గ‌న్నాథ‌న్, ఎడిటింగ్ ర‌మేష్ సెల్వ‌రాజా.

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments