Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్యాగరాయ గానసభలో ఏడవ ఆడిటోరియంను ప్రారంభించిన రమణాచారి, పురాణపండ

డీవీ
గురువారం, 29 ఆగస్టు 2024 (08:19 IST)
Ragaavachari and others
28 దశాబ్దాల ఘన సాంస్కృతిక, సాహిత్య చరిత్రతో ఎందరో కళాకారుల, సాహిత్యకారుల వైభవానికి కళామతల్లిగా ఆశీర్వదించిన శ్రీ త్యాగరాయ గానసభలో అనేక సంగీత ఉత్సవాలకు, ఉచిత సంగీత, నాట్య తరగతులకు నూతనంగా ఏడవ ఆడిటోరియం ను ప్రారంభించడం శుభ పరిణామమని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె.వి.రమణాచారి పేర్కొన్నారు.
 
హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభలో నూతనంగా ఏర్పాటైన సంగీత నాట్య కళా వేదికను ఆయన ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రముఖ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ' ఆరాధన ' పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ ... సంగీత, నాట్య రంగాలలో క్రొత్త తరాల శిక్షణకోసం శ్రమించి, పరిశ్రమించి మరీ త్యాగరాయ గానసభ అధ్యక్షులు జనార్ధన మూర్తి ఇంత వైభవాన్ని మిత్రుల సహకారంతో నిర్మించడం  ఏడుకొండలవాడి దయేనని అభినందించారు.
 
ఈ కార్యక్రమానికి  కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు , త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి అధ్యక్షత వహించారు.
 
సభలు, సమావేశాలకు సహజంగా దూరంగా వుండే  ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ చక్కని కార్యక్రమానికి హాజరవ్వడంతో పలువురు  సాహితీ, సాంసృతిక  రంగాల ప్రముఖులు ఆప్యాయంగా పలకరించడం విశేషం. 
 
ప్రముఖ పాత్రికేయులు శంకరనారాయణ, త్యాగరాయగాన సభ కమిటీ సభ్యులు చక్రపాణి ప్రసాద్,  శ్రీమతి,పద్మజ నీలిమ ,  శ్రీమతి గీత తదితరులు,  సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  సభలు, సమావేశాలకు సహజంగా దూరంగా వుండే  ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ చక్కని కార్యక్రమానికి హాజరవ్వడంతో పలువురు సాహితీ, సాంసృతిక  రంగాల ప్రముఖులు ఆప్యాయంగా పలకరించడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments