Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపిచంద్ 'సీటీమార్' రిలీజ్ డేట్ ఫిక్స్ - ట్రైలర్ ఇదే

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (15:54 IST)
టాలీవుడ్ హీరో గోపీచంద్ నటిస్తున్న చిత్రం సీటీమార్. మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుకుంటూ వస్తోంది. ఇక ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఈ సినిమాను దర్శక నిర్మాతలు సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 
 
ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ నేపథ్యంలో నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్’ను రామ్ పోతినేని తన సోషల్ మీడియా వేదికగా విడుదలచేశారు. ట్రైలర్ చూస్తుంటే.. స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్‌లా కనిపిస్తోంది. 
 
తమన్నా సొంతంగా డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. మాస్ డైలాగులలతో ఆకట్టకుంటోంది. ఇక ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా 'సీటీమార్' ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. 
 
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాట జ్వాలా రెడ్డికి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎంఎంటీఎస్ ట్రైనులో యువతిపై అత్యాచారయత్నం!! (Video)

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments